హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు హాజరుకానున్న చంద్రబాబు
- సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ
- ఆగస్టు 23న క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి
- హాజరుకానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
- చంద్రబాబు హయాంలో ఏర్పాటైన హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది.