ప్రపంచానికి నిజం తెలియాలి: 'గాండీవధారి అర్జున' ట్రైలర్ డైలాగ్!

Gandeevadhari Arjuna Movie Trailer Released
  • 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్ 
  • చరణ్ తో రిలీజ్ చేయించిన ట్రైలర్
  • విదేశాలలో జరిగిన చిత్రీకరణ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల 
వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గాండీవధారి అర్జున' ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ భారీ యాక్షన్ మూవీలో సాక్షి వైద్య కథానాయికగా కనిపించనుంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. అందులో భాగంగానే కొంతసేపటి క్రితం చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేయించారు. భారీ యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్,  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 'ప్రపంచానికి నిజం తెలియాలి' అంటూ తన ఆపరేషన్ ను పూర్తి చేయడంలో హీరో ప్రాణాలను పణంగా పెట్టడం కనిపిస్తోంది.

ఫారిన్ లో రిస్కీ ఫైట్లను చిత్రీకరించారనే విషయం అర్థమవుతూనే ఉంది. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఈ ఆపరేషన్ లో భాగంగా కనిపిస్తోంది. తుపాకుల మోతలు .. కార్ల ఛేజింగ్స్ .. బ్లాస్టింగ్స్ తో ట్రైలర్ ను హోరెత్తించారు. నాజర్ .. అభినవ్ గోమఠం .. నరేన్ .. విమలా రామన్ .. ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు.

Advertisement
Varun Tej
Sakshi Vaidya
Nassar
Praveen Sattaru

More Telugu News