ప్రియుడితో బిగ్ బాస్ ఫేమ్ కీర్తి ఎంగేజ్ మెంట్
- కార్తీకదీపం సీరియల్ తో గుర్తింపు పొందిన కీర్తి
- తన ప్రియుడు కార్తీక్ తో ఎంగేజ్ మెంట్
- హాజరైన సెలబ్రిటీలు, సీరియల్ యాక్టర్లు
కీర్తి పూర్తి పేరు కీర్తి భట్. బెంగళూరులో జన్మించిన కీర్తికి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. దీంతో ఆమె నటనలో శిక్షణ తీసుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది. కన్నడ సినీరంగం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో 'ఐస్ మహల్' అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆరేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది.