మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ

మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ

Minister Errabelli Dayakar Rao signature forgery
  • ఫేక్ లెటర్ హెడ్ తయారు చేసిన పాషా, గుంటి శేఖర్
  • డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్ కు లేఖ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లి ఓఎస్డీ
కేటుగాళ్లు సాక్షాత్తు మంత్రుల సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన గౌస్ పాషా, గుంటి శేఖర్ లు ఎర్రబెల్లి దయాకర్ రావు నకిలీ లెటర్ హెడ్ తయారు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ ఎర్రబెల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసిన లేఖను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందించారు. ఈ విషయం ఎర్రబెల్లి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో, సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రబెల్లి ఓఎస్డీ డాక్టర్ రాజేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గౌస్ పాషా, గుంటి శేఖర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
Errabelli
BRS
Forgery

More Telugu News