సూర్యాపేటలో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR attends inaugurations in Suryapet
  • సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
  • పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం
  • జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన వైనం
  • మెడికల్ కాలేజీ, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ప్రారంభోత్సవం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సూర్యాపేటలో పర్యటించారు. ఆయన పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ వైద్య కళాశాలను రూ.156 కోట్ల వ్యయంతో నిర్మించారు. పట్టణంలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్ ను కూడా ప్రారంభించారు. 

ఈ సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ ను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించారు. సూర్యాపేటలో తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ప్రారంభోత్సవం చేశారు. సూర్యాపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభించారు.
Go Back to Shorts
CM KCR
Inaugurations
Suryapet
BRS
Telangana

More Telugu News