14 ఏళ్ల బాలికపై ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి పలుమార్లు అత్యాచారం
- గతేడాది తండ్రిని కోల్పోయిన బాలిక
- ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడిన నిందితుడు
- గర్భం దాల్చడంతో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించిన నిందితుడి భార్య
బాధిత బాలిక గతేడాదే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2020-2021 మధ్య పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అతడు తన భార్యకు చెప్పడంతో ఆమె తన కుమారుడితో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించినట్టు బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.