Advertisement

'జైలర్' తొలివారం వసూళ్లు ఇవే!

Jailer movie update
  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
  • నిన్నటితో వారం రోజుల పూర్తి
  • 375.40 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా
  • త్వరలోనే 400 కోట్ల మార్కును టచ్ చేసే ఛాన్స్
'రోబో 2.0' సినిమా తరువాత రజనీ వరుస సినిమాలు చేస్తూనే వెళుతున్నాడు. అవి భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తూనే వచ్చాయి. అయితే వీకెండ్ తరువాత వాటి జోరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. రజనీ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ .. ఆయన చేసే మేజిక్ లో ఎలాంటి తేడా ఉండదు. కానీ కథాకథనాల పరంగానే అవి తేడా కొట్టేశాయి. 

ఆ మధ్య ఆయన చేసిన 'పెద్దన్న' సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా తమిళనాట కూడా తన సత్తా చూపలేకపోయింది. ఇక తెలుగులో కూడా వసూళ్ల పరంగా ఆ సినిమా డీలాపడిపోయింది. ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమానే 'జైలర్'. రిలీజ్ రోజునే ఈ సినిమా తన స్థాయిని చాటుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా ఇంకా ఆ మార్కును చేరుకోలేదు. ఈ సినిమా నిర్మాణ సంస్థ తాజాగా తొలివారం వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 375.40 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టుగా చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే త్వరలోనే ఈ సినిమా 400 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Advertisement
Rajanikanth
Ramya Krishna
Jailer

More Telugu News