చిరంజీవి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గా తెరపైకి మురుగదాస్ పేరు!
- చిరూ ప్రాజెక్టులపై యువ దర్శకుల కసరత్తు
- లైన్లో కల్యాణ్ కృష్ణ - శ్రీవశిష్ఠ
- కొత్తగా వినిపిస్తున్న మురుగదాస్ పేరు
- గతంలో 'స్టాలిన్' తో హిట్ కొట్టిన డైరెక్టర్
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోను .. శ్రీవశిష్ఠ దర్శకత్వంలోను చిరంజీవి చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన వినిపించిన కథ చిరంజీవికి బాగా నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అందువల్లనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
గతంలో చిరంజీవితో మురుగ దాస్ 'స్టాలిన్' సినిమా చేశాడు. మెగాస్టార్ ను మరింత స్టైల్ గా చూపించిన సినిమా ఇది. ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో ఈ సినిమా కూడా కనిపిస్తుంది. లోకేశ్ కనగరాజ్ .. నెల్సన్ కంటే ముందు, తమిళ సినిమాకి భారీ హిట్స్ రుచి చూపించిన దర్శకుడు మురుగదాస్. అందువల్లనే చిరూ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు.