గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా ఇక్కడికి తీసుకు వస్తాం: ఎమ్మెల్సీ కవిత

MLA Kavitha lashes out at Congress leader Rahul Gandhi
  • తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు, కేసీఆర్ గురించే ఆలోచిస్తున్నారన్న కవిత
  • ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించామని వెల్లడి
  • బోధన్‌లో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చామన్న ఎమ్మెల్సీ
  • రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ కవిత
వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి యాత్రకు పోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్‌ కమిటీ సభ్యుల భేటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు.. కేసీఆర్ గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రతి కులానికి తాము ఆత్మగౌరవ భవనం నిర్మించామన్నారు. కులమతాలకు తావులేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.  

గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. బోధన్‌లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, 152 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ తీసుకొచ్చామన్నారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలనూ తీసుకువస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీపై స్పందిస్తూ... కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్‌ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Congress
Rahul Gandhi
BJP

More Telugu News