బొత్స కుటుంబ సభ్యులు సహా 50 మంది మాతో టచ్‌లో ఉన్నారు: బొండా ఉమ
వచ్చే ఉగాది నాటికి టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని సవాల్ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో ఆయన తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులు సహా యాబై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా ఆయన అన్నారు. వైసీపీకి అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని, ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.