తిరుమలలో మరోసారి చిరుత దాడి.. ఆరేళ్ల బాలిక మృతి
- శుక్రవారం అలిపిరి కాలినడక మార్గంలో ఘటన
- రాత్రి 8 గంటలకు బాలికతో బయలుదేరిన కుటుంబం
- 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నాక చిరుత దాడి
- బాలికను అడవిలోకి లాక్కుపోయిన చిరుత
- బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు
- మరుసటి రోజు ఉదయం ఆలయానికి సమీపంలో బాలిక మృతదేహం గుర్తింపు
రాత్రి సమయంలో గాలింపు చర్యలు కుదరకపోవడంతో పోలీసులు ఉదయం వెతుకుతుండగా బాలిక మృతదేహం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో కనిపించింది. బాలిక మృతదేహాన్ని చిరుత సగం తిన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెమని తెలిపారు. జూన్ 11న ఓ బాలుడిపై ఇలాగే చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో బాలుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.