జగన్ రెడ్డీ.. ఇది మోసకారి సంక్షేమం కాదా?: అచ్చెన్నాయుడు
- అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మడమ తిప్పాడని విమర్శ
- మహిళల పొదుపు లబ్ధి రూ. 30 వేలకు తగ్గిపోయిందని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తారన్న అచ్చెన్న
జగన్ చేసిన మోసం వల్ల పొదుపు మహిళలకు లబ్ధి రూ. 30 వేలకు తగ్గిపోయిందని అచ్చెన్న దుయ్యబట్టారు. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆచరణలో జగన్ రెడ్డి మొండిచేయి చూపాడని అన్నారు. చేయూత పథకంతో జగన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించాడని... పథకం కింద అన్ని కులాలు కలిపి కేవలం 30 లక్షల మందికి మాత్రమే లబ్ధి అంటే మిగిలిన 85 లక్షల మంది సంగతేంటి జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయమని చెప్పారు.