ప్రపంచ కప్ పనుల్లో అపశ్రుతి.. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అగ్ని ప్రమాదం
- డ్రెస్సింగ్ రూమ్‌లో చెలరేగిన మంటలు
- రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి
తెచ్చిన సిబ్బంది - ప్రపంచ కప్ కోసం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు
ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో ప్రస్తుతం స్టేడియంలో పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబరు 15 నాటికి పునరుద్ధరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల పురోగతిపై ఇటీవల ఐసీసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చే నెలలో మరోసారి పరిశీలనకు రానున్నారు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరగడం కొత్త సమస్యలను సృష్టించింది. స్టేడియంలో ఏ మ్యాచ్‌కైనా ఫైర్ పర్మిట్ తప్పనిసరి. ప్రపంచకప్ నిర్వహణలో కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. దాంతో, స్టేడియంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారు.