ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు పర్యాటకులు.. రోడ్డుపైనే పడిగాపులు
- రెండు రోజులుగా భారీ వర్షాలు
- విరిగిపడుతున్న కొండ చరియలు
- కొడియాల వద్ద చిక్కుకున్న 1500 వాహనాలు, 20 వేల మంది యాత్రికులు
యాత్రికులతోపాటు స్థానికులు కూడా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, 20 వేలమంది యాత్రికులు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా వీరిలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఉండగా వీరంతా ఇలా చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.