కాఫీలో రోజూ కొంచెం చొప్పున భర్తకు విషం.. తర్వాత ఏమైందంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాఫీలో రోజూ కొంచెం చొప్పున భర్తకు విషం.. తర్వాత ఏమైందంటే..!

She tried to kill her husband by poisoning his coffee daily
  • భర్త మరణిస్తే వచ్చే పరిహారంపై ఆశ
  • కాఫీలో రోజూ కొంచెం బ్లీచ్ కలిపి ఇస్తున్న వైనం
  • రహస్య కెమెరాల ద్వారా గుర్తించిన భర్త
అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్తకు రోజూ కొంచెం చొప్పున విషం కలిపి ఇస్తూ, అతడిని అంతమొందించేందుకు ప్రణాళిక వేసింది. కానీ, తన భార్య నిజస్వరూపాన్ని అతడు పట్టేసుకున్నాడు. ఆమె కొన్ని నెలల నుంచి కాఫీలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్న విషయం బయటపడింది. మెలోడీ ఫెలికానో జాన్సన్ ను మొదటి శ్రేణి హత్యకు పాల్పడినట్టు జ్యూరీ నిర్ధారించింది. భార్య తనకు ఇచ్చే కాఫీ కప్పులో బ్లీచ్ పౌడర్ కలుపుతుండగా, ఆమె భర్త రాబీ జాన్సన్ దాన్ని రహస్యంగా వీడియో తీసి పోలీసులకు పంపించాడు. 

అసలు రాబీ జాన్సన్ కు ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది? అన్న సందేహం వచ్చే ఉంటుంది. ఓ రకమైన దుర్వాసన అనిపించడంతో అతడికి సందేహం వచ్చింది. దాంట్లో తన నివాసంలో రహస్య కెమెరా అమర్చాడు. కాఫీ మేకర్ లో ఏదో గుర్తు తెలియని పదార్థాన్ని ఫెలికానో వేస్తుండడం అందులో రికార్డు అయింది. అయినా సరే ఆమెకు సందేహం రాకూడదని ఆ కాఫీని రాబీ తాగేవాడు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసే రాబీ జాన్సన్.. మంతన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భార్యతో కలిసి తిరిగి అమెరికాకు వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఒకటి, రెండు కాదు ఇంట్లోని చాలా ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు అమర్చాడు రాబీ జాన్సన్. దీంతో ఆమె చేస్తున్న కుట్ర రికార్డు అయింది. తన భర్త మరణిస్తే వచ్చే పరిహారం కోసం ఆమె ఇలా చేసినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
Advertisement
woman
tried
kills husband
poisoning
coffee

More Telugu News