వెస్టిండీస్ తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

వెస్టిండీస్ తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in 2nd T20I
  • టీమిండియా, వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • తొలి మ్యాచ్ లో గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్
  • నేడు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ జరగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 

తొలి టీ20లో ఓటమిపాలైన నేపథ్యంలో నేటి మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కృతనిశ్చయంతో టీమిండియా బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఒక మార్పు చేశారు. నిన్న నెట్ ప్రాక్టీసులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి గాయం కావడంతో, అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. 

మరోవైపు, వెస్టిండీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. తొలి టీ20 ఆడిన జట్టే ఇవాళ కూడా బరిలో దిగుతోంది.
Advertisement
Team India
Toss
2nd T20I
West Indies

More Telugu News