Electricity: ఏపీలో ఈ నెల 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

AP Electricity employees set to go for indefinite strike
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకుంది. తమ సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో, జేఏసీ నిరవధిక సమ్మెకు నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలి రావాలని జేఏసీ పేర్కొంది.
Go Back to Shorts
Electricity
Employees
Indefinite Strike
JAC
Andhra Pradesh

More Telugu News