విద్యార్థి దశ నుంచే నాతో చంద్రబాబుకు గొడవ ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
- పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమన్న పెద్దిరెడ్డి
- నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శ
- పోలీసులపై దాడి చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారని వ్యాఖ్య
విద్యార్థి దశ నుంచే తనతో చంద్రబాబుకు గొడవ ఉందని ఆయన చెప్పారు. అందుకే పుంగనూరులో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని అన్నారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమని చెప్పారు. మతిభ్రమించి ఆయన నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
బైపాస్ రోడ్ లో వెళ్తానని రోడ్ మ్యాప్ ఇచ్చి పుంగనూరు పట్టణంలోకి వచ్చారని దుయ్యబట్టారు. తన కాన్వాయ్ లో రౌడీమూకలను, కర్రలను, రాళ్లను తెచ్చారని చెప్పారు. పోలీసులపై దాడి చేసిందేకాక, రివర్స్ లో మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.