ఇలాంటి విమర్శలను పట్టించుకోను: సుస్మితా సేన్

Sushmita Sen Reply To Gold Digger Comments
షార్ట్స్‌లో చూడండి
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. 'గోల్డ్ డిగ్గర్' అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ... డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ తనను విమర్శిస్తున్నారని... ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. అవమానాలను స్వీకరించడం అంటే అది అవమానమేనని, అందుకే తాను స్వీకరించనని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని చెప్పారు. తనపై వచ్చే కామెంట్లపై స్పందించవద్దని ఇండస్ట్రీలోని ఎంతో మంది తనకు చెప్పారని అన్నారు. తనకు సంబంధించిన వ్యవహారాలపై తనకు ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. తనకు గోల్డ్ కంటే డైమండ్స్ ఇష్టమని... తన కోసం వాటిని కొంటుంటానని తెలిపారు.
Go Back to Shorts
Sushmita Sen
Bollywood
Gold Digger

More Telugu News