చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి విడదల రజని
- చంద్రబాబు జోక్ లకు ప్రజలు నవ్వుకుంటున్నారన్న విడదల రజని
- ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే విషయం బాబుకు అర్థమయిందని ఎద్దేవా
- దత్తపుత్రుడితో కలిసి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపాటు
గత నాలుగేళ్లుగా సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయామనే అక్కసుతో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు బురద చల్లుతున్నాయని అన్నారు.
టీడీపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రజిని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి శూన్యమని... జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తోందని చెప్పారు. 11 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.