బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్
- ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’
- కొత్త కేసుల్లో 14.6 శాతం అవే
- అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
బ్రిటన్‌లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. కరోనా టీకాలు తీసుకున్నా, ఒకసారి కరోనా బారినపడి కోలుకున్నా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్‌తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలు కనిపించలేదని పేర్కొంది.