మరోసారి స్క్రీన్ పై మెరవనున్న ప్రభాస్, అనుష్క జోడీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి స్క్రీన్ పై మెరవనున్న ప్రభాస్, అనుష్క జోడీ?

Prabhas and anushka to pair in another movie
  • ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే
  • వీరిద్దరి కాంబినేషన్లో 'బాహుబలి' చిత్రాలను నిర్మించిన శోభు యార్లగడ్డ
  • ఇద్దరి కాంబినేషన్లో శోభు మరో చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్
టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్కలది ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తమ మధ్య అలాంటిది ఏమీ లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. వారు చెప్పినట్టుగానే అందరూ అనుకున్న విధంగా ఏమీ జరగలేదు. తాజాగా ఈ జంటకు సంబంధించి ఒక వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. 

మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోందనేదే ఆ వార్త. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం వైరల్ అవుతోంది. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు చెపుతున్నారు.
Advertisement
Prabhas
Anushka Shetty
Tollywood
Shobhu Yarlagadda

More Telugu News