రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- గతంలోను తనపై కబ్జా ఆరోపణలు వచ్చాయన్న మంత్రి
- మాయమాటలతో ఓట్లు సంపాదించుకోలేదని వ్యాఖ్య
- కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్
వక్ఫ్ భూములను తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. కులం చూసి కాదని, ప్రజలు గుణం చూసి గెలిపించారన్నారు. అధిక మెజార్టీతో గెలిచిన తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.