Chandrababu: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు

Manoj and Mounika meets TDP chief Chandrababu Naidu
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ దంపతులు కలిశారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత నివాసానికి మనోజ్, మౌనిక వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలకు చాలాకాలం గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ ఇటీవలే భూమూ మౌనికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, మనోజ్ దంపతులు... చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నాయకురాలు. గత టీడీపీ హయాంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు.

2019 ఎన్నికల్లో మనోజ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని, వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో మంచు కుటుంబం వైసీపీలోనే ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈయన టీడీపీ అధినేతను కలవడం గమనార్హం.
Go Back to Shorts
Chandrababu
Manchu Manoj

More Telugu News