ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తా: ఢిల్లీలో బండి సంజయ్
- నడ్డాకు శాలువా కప్పి సన్మానించిన కరీంనగర్ ఎంపీ
- తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న బండి సంజయ్
- కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.