అంబటి రాంబాబు గారు డ్యాన్స్ బాగా చేశారు: సాయిధరమ్ తేజ్
- 'బ్రో' సినిమాలో పృథ్వీ డ్యాన్స్ పై వివాదం
- అంబటి డ్యాన్స్ ను అనుకరించలేదన్న సాయితేజ్
- అంబటికి మీసాలు ఉంటాయి.. పృథ్వీకి లేవని వ్యాఖ్య
మరోవైపు ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, నిర్మాత విశ్వప్రసాద్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ ను సినిమాలో పెట్టారనే విషయాన్ని యాంకర్ లేవనెత్తారు. దీనికి సమాధానంగా అలాంటిది ఏమీ లేదని సాయితేజ్ చెప్పారు. ఆరోజు డ్యాన్స్ చేసిన సందర్భంగా అంబటి వేసుకున్న టీషర్ట్, ప్యాంట్, షూ లాంటివే ఈ సినిమాలో కూడా పృథ్వీ వేసుకున్నారని యాంకర్ తెలిపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ... ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా ఉందని, పృథ్వీకి మీసాలు లేవని చెప్పారు. మరోవైపు అంబటి రాంబాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేశారని కితాబునిచ్చారు.