మలయాళ స్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా..?
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
- ప్రభాస్ ను డైరెక్ట్ చేయబోతున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్
- ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్
మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా ప్రభాస్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో లూసిఫర్, బ్రోడాడి వంటి సినిమాల్లో నటిస్తూ, వాటిని డైరెక్ట చేశాడు పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలో ప్రభాస్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.