వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
- అక్రమ మట్టి తవ్వకాలపై టీడీపీ శ్రేణుల నిరసన ర్యాలీ
- పలువురిపై కేసులు పెట్టిన పోలీసులు
- అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి నిరసన ర్యాలీ
- కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
- వినుకొండలో ఇంటర్నెట్ బంద్
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఇరు వర్గాల రాళ్ల దాడిలో 15 మంది గాయపడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం వినుకొండలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు.