బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించినవాళ్లేనన్న షర్మిల
- దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలని విమర్శ
- అఫిడవిట్లో చూపించింది గోరంతైతే దాచింది కొండంత అని మండిపాటు
అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్టీపీ విజ్ఞప్తి చేస్తుందని షర్మిల తెలిపారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని చెప్పారు.