శుభవార్త చెప్పిన కేసీఆర్... ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో వీఆర్ఏల విలీనం
- వీఆర్ఏలకు పే స్కేల్ అందిస్తూ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీవో
- జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్
- రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు
రెవెన్యూ శాఖలో 20వేల మందికి పైగా ఉన్న వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.