తెలంగాణకు భారీ వర్ష సూచన
- మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
- 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరిక
- రెండు రోజులు ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ
దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో 24న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.