‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5

Tiruveer acts in ZEE 5 web series Mission Tashaffi
  • ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో మిషన్ తషాఫి వెబ్ సిరీస్
  • కీలకపాత్రలో తిరువీర్
  • తిరువీర్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రకటన
  • ప్రణతి రెడ్డి నిర్మాతగా మిషన్ తషాఫి 
  • మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపుదిద్దుకుంటున్న వెబ్ సిరీస్
తిరువీర్‌... తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీ మాధ్య‌మంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన జీ5 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

ఈ వెబ్ సిరీస్ లో తిరువీర్ పాత్రను జీ 5 అధికారికంగా ప్రకటించింది. తిరువీర్ పుట్టినరోజు నేపథ్యంలో, తిరువీర్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారంటూ ఆ మేరకు ప్రకటన చేసింది. 

ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మాత‌. అనుకున్న ప్ర‌కారం రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. 

ఇప్పుడు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావ‌టంపై మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను డైరెక్ట‌ర్ ఊహించిన దాని కంటే ఇంకా బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తార‌ని మేక‌ర్స్‌ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు వంటి డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేయ‌టంపై తిరువీర్ సైతం ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

ఇండియాలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్ కి మధ్య నడిచే భావోద్వేగమైన  హై వోల్టేజ్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ఇది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఓటీటీలో ఎవ‌రూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌లేదు. కానీ తొలిసారి ‘మిషన్ తషాఫి’ సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీక‌రిస్తున్నారు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు.

మిషన్ తషాఫిలో తిరువీర్‌, సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.
Advertisement
Tiruveer
Mission Tashaffi
ZEE 5
Web Series
Praveen Sattaru
Pranati Reddy

More Telugu News