నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం వైష్ణవినే: 'బేబి' ఈవెంటులో బన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం వైష్ణవినే: 'బేబి' ఈవెంటులో బన్నీ

Baby Appreciation Meet
  • ఈ నెల 14వ తేదీన విడుదలైన 'బేబి'
  • హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా 
  • ఈ సినిమా టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్ 
  • వైష్ణవి నటనకి అవార్డు రావడం ఖాయమని వెల్లడి
  • తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని కోరిన బన్నీ 
అల్లు అర్జున్ తనకి ఏ మాత్రం అవకాశం ఉన్నప్పటికీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో కనిపిస్తుంటాడు. అలాగే తనకి నచ్చితే ఆ సినిమాను గురించి ట్వీట్ పెడుతుంటాడు .. ఆ సినిమా టీమ్ ను అభినందిస్తూ ఉంటాడు. ఇటీవల వచ్చిన 'బేబి' హిట్ టాక్ తో .. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. గీతా ఆర్ట్స్ కి అత్యంత సన్నిహితుడైన ఎస్.కె.ఎన్. ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా టీమ్ ను అభినందించడం కోసం, అల్లు అర్జున్ ప్రత్యేకించి ఒక ఈవెంటునే ఏర్పాటు చేయించాడు. 

ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ .. "లవ్ లో ఉన్న పెయిన్ ను చూపిస్తూ సినిమాలు తీయడం చాలా కష్టమైన విషయం. అలాంటి సినిమాను అద్భుతంగా తీసిన సాయిరాజేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిర్మాత ఎస్.కె. ఎన్. ను చూస్తే, కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందిగానీ, ఆయన ఎంత కష్టపడి వచ్చాడనేది నాకు తెలుసు. తాను కసితో చేసిన ఈ సినిమా తనకి ఐడెంటిటీ తీసుకుని రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. 

ఆనంద్ దేవరకొండ గట్టి హిట్ కొట్టాడు .. తను ఈ సినిమాను నమ్మి చేయడం గొప్ప విషయం. విరాజ్ కూడా చాలా నేచురల్ గా చేశాడు. ఇక ఈ రోజున నేను ఈవెంటుకు రావడానికి సగానికి పైగా కారణం వైష్ణవినే. 'అల వైకుంఠపురములో' సినిమాలో తను నా సిస్టర్ రోల్ చేసింది. అలాంటి తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా పెట్టి సినిమాలు చేసే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఆ రోజున అనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. 

ఇక నుంచి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నాను. వైష్ణవి తెలంగాణ యాస చాలా ముద్దుగా మాట్లాడింది .. ఈ సినిమా తనకి ఉత్తమనటిగా అవార్డును తెచ్చిపెట్టడం ఖాయమని భావిస్తున్నాను. విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..  బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ చాలా బాగున్నాయి. మొత్తానికి సాయిరాజేశ్ ఇండస్ట్రీకి పెద్ద హిట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఇంతగా కష్టపడిన టీమ్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను .. ఈ సినిమాను ఇంతగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.

Advertisement
Allu Arjun
Anand Devarakonda
Vaishnavi
Viraj
Baby Movie

More Telugu News