మార్గదర్శి కేసు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
- చిట్ లను రద్దు చేస్తూ చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు
- హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఖాతాదారులు
- చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
చిట్ లకు డిపాజిట్లు సేకరించి చిట్ రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే చిట్లు ప్రారంభమయ్యాయని ఖాతాదారుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 50 శాతం డబ్బు చెల్లించి చిట్ లు ప్రారంభించామని మార్గదర్శి తరపు లాయర్ చెప్పారు. చిట్ రిజిస్ట్రార్ కు చిట్ లను రద్దు చేసే అధికారం ఉంటుందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది.