విడాకుల దిశగా కలర్స్ స్వాతి..?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విడాకుల దిశగా కలర్స్ స్వాతి..?

talk of colors swathi heading for divorce goes viral on social media
  • ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలు తొలగించిన కలర్స్ స్వాతి
  • స్వాతి విడాకులు తీసుకోనుందా? అంటూ అభిమానుల్లో ఆందోళన
  • విడాకులకు మునుపు సమంత, నిహారిక కూడా తమ భాగస్వాముల ఫొటోల తొలగింపు
తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ లుక్స్‌తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న ‘కలర్స్’ స్వాతికి సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వాతి త్వరలో భర్త నుంచి విడిపోనుందనేది దీని సారాంశం. ఇటీవల ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త ఫొటోలు తొలగించేసిందని, విడాకుల దిశగా ఇది తొలి అడుగని నెటిజన్లు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. నిప్పు లేందే పొగరాదని, విడాకులకు పూర్వం సమంత, నిహారిక కూడా ఇలాగే తమ భాగస్వాముల ఫొటోలను సోషల్ మీడియాలోంచి తీసేశారని గుర్తు చేస్తున్నారు. 

సుమారు రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే విధంగా స్వాతి విడాకులు తీసుకుంటోందన్న వార్త హల్‌చల్ చేసింది. అప్పట్లో స్వాతి అకస్మాత్తుగా తన భర్త ఫొటోలు తొలగించడంతో కలకలం రేగింది. దీంతో, ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోని భర్త ఫొటోలను ఆర్కైవ్స్‌లో పెట్టుకున్నట్టు చెప్పిన ఆమె తన ఫోన్లోని భర్త ఫొటోలను కూడా చూపించాల్సి వచ్చింది.
Advertisement
Colors Swathi
Tollywood
Samantha
Niharika Konidela

More Telugu News