దేశంలో ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన పేదరికం
- పేదరికం నుండి బయటపడిన 13.5 కోట్ల మంది
- పరిగణనలోకి పౌష్టికాహారం, విద్య, శానిటేషన్ తదితర సూచికలు
- అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 34.4 శాతం తగ్గుదల
ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని వెల్లడించింది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 34.3 శాతం పేదరికం తగ్గిందని, ఆ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్ ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని పేదల శాతం 2015-16లో 24.85 శాతం ఉండగా, 2019-21 నాటికి 14.96 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుండి 5.27 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 32.59 శాతం నుండి 19.28 శాతానికి తగ్గినట్లు తెలిపింది. పేదరికం తీవ్రత 47 శాతం నుండి 44 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.