కాంగ్రెస్ సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దు: కేటీఆర్

కాంగ్రెస్ సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దు: కేటీఆర్

KTR fires on Congress party leaders
  • ఉచిత్ విద్యుత్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
  • రైతులకు కాంగ్రెస్ ఏనాడూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదన్న కేటీఆర్
  • తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఉచిత విద్యుత్ అంశంలో తెలంగాణ అధికార పక్షం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా రైతులను దగా చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఏనాడూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మూడెకరాల పొలం తడవాలంటే మూడు గంటల కరెంట్ సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఏం సమాధానం చెబుతారు? అంటూ కేటీఆర్ నిలదీశారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రాసిందే రాత, గీసిందే గీత అన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దని సూచించారు. కాంగ్రెస్ రాబందుల పార్టీ అని అభివర్ణించారు. రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెలియవని, ఆయనకు తెలిసిందల్లా పబ్బు, క్లబ్బు మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Advertisement
KTR
BRS
Congress
Telangana

More Telugu News