వయసు పెరిగిపోతున్నా పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన సదా
- 39 ఏళ్లకు చేరుకున్న సదా వయసు
- తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని స్పష్టం చేసిన సదా
- పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని వ్యాఖ్య
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావచ్చు, కాకపోవచ్చు అని పేర్కొంది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని చెప్పింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని, చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారని, అందుకే తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది.