జనసేన నేత చెంపలపై కొట్టిన సీఐ అంజు యాదవ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసైనికులు
- పవన్ కల్యాణ్ పై జగన్ వ్యాఖ్యల పట్ల జనసేన నిరసన
- శ్రీకాళహస్తిలో జగన్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన జనసైనికులు
- దిష్టిబొమ్మ దహనానికి అనుమతించబోనన్న సీఐ
అయితే దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ అంజు యాదవ్ వారికి చెప్పారు. అయినప్పటికీ వారు దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో ఒక నేత చెంపలపై ఆమె కొట్టారు. ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మహిళా సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.