తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు.. పాదయాత్రకు రెడీ అవుతున్న హీరో విజయ్!
- నిన్న తన అభిమాన సంఘం సభ్యులతో సమావేశమైన విజయ్
- ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
- తన 'లియో' సినిమా విడుదలకు ముందే పాదయాత్ర చేపట్టే అవకాశం
ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన తాజా చిత్రం 'లియో' విడుదల కంటే ముందుగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
మరోవైపు ఇటీవలే విజయ్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇదంతా కూడా రాజకీయ అరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.