Varun Tej: 'గాండీవధారి' స్పీడ్ మామూలుగా లేదే .. ప్రీ టీజర్ రిలీజ్!

Gandeevadhari Arjuna Movie Pre Teaser Released
షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ హీరోగా 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందింది. ఎస్వీ సీసీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడవనుంది. టైటిల్ తోను .. ఫస్టులుక్ తోను ఆడియన్స్ లో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. 

అలాంటి ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ పాత్ర వైపు నుంచి ఉండే ఫోర్స్ ను ఈ టీజర్ లో చూపించారు. భారీ గన్స్ తో ఆయన తన శత్రువులను వేటాడటం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ రోల్ చాలా స్టైలీష్ గా ఉంటుందనే విషయం ఈ ప్రీ టీజర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే పూర్తి టీజర్ ను వదలనున్నట్టుగా ప్రకటించారు.

ప్రవీణ్ సత్తారు మొదటి నుంచి కూడా యాక్షన్ కంటెంట్ ఉన్న కథల వైపునే దృష్టి పెడుతూ వెళ్లాడు. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాయి. అదే తరహాలో ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్ కనిపిస్తోంది. సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Varun Tej
Sakshi Vaidya
Praveen Sattaru
Gandeevadhari Arjuna

More Telugu News