Anushka: 'మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి' నుంచి హుషారైన సాంగ్!

Miss Shetty Mr Polyshetty Song Released
షార్ట్స్‌లో చూడండి
అనుష్క - నవీన్ పోలిశెట్టి జంటగా 'మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి' సినిమా రూపొందింది. చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా కావడంతో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగును రిలీజ్ చేశారు.

'ఎందుకంత ఇష్టం నేనంటే .. ఇందులోని గొప్ప నేను నీకంటే .. ఎంత ఎంత నచ్చుతుందో నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే' అంటూ ఈ పాట సాగుతోంది. రాధన్ స్వరపరిచిన ఈ బాణీకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. హుషారైన బీట్ .. అందుకు తగిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. 

అనుష్కను అభిమానిస్తూ .. ఆరాధిస్తూ .. ప్రేమిస్తూ, ఆమె రాకతో తన లైఫ్ మొత్తం మారిపోయిందని హీరో వ్యక్తం చేసే తన మనసులోని మాటనే ఈ పాట. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకుంటాయనే చెప్పాలి.
Go Back to Shorts
Anushka
Naveen Polyshetty
Radhan

More Telugu News