వరుసగా రెండోరోజు నిలిచిన అమర్నాథ్ యాత్ర, చిక్కుకుపోయిన తెలుగువారు
- కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత
- యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుకు తరలింపు
- పంచతర్ణి ప్రాంతాల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారు
శనివారం ఉదయం కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ కారణంగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంపుల్లో ఉంచారు. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం కూడా యాత్రను నిలిపివేశారు.