ఇది పులివెందుల ఎమ్మెల్యే, సీఎం జగన్ కు అంకితం: చంద్రబాబు ట్వీట్

  • పులివెందుల నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై చంద్రబాబు ట్వీట్
  • రైతులు సొంత డబ్బులతో రోడ్డు బాగుచేసుకున్నారన్న బాబు
  • వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన టీడీపీ అధినేత
ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రోడ్ల దుస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ సొంత డబ్బులతో రోడ్డు బాగుచేసుకున్నారని ట్వీట్ చేశారు. లింగాల - క్రిష్టంగారిపల్లె రోడ్డుకు రైతులు రూ. 60 వేలు విరాళాలు సేకరించి మరమ్మతులు చేసుకున్నారని తెలిపారు. 

ప్రభుత్వం రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో సొంత ఖర్చుతో స్థానిక ప్రజలు రోడ్డు బాగుచేసుకున్నారని చెప్పారు. పులివెందుల ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి జగన్ కు ఇది అంకితం అని అన్నారు. ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా షేర్ చేశారు.


More Telugu News

Chandrababu Telugudesam Jagan YSRCP