Jude Anthany Joseph: లైకా బ్యాన‌ర్‌ నుంచి భారీ ఆఫర్ కొట్టేసిన ‘2018’ డైరెక్టర్!

  • ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో '2018' ఒకటి 
  • కంటెంట్ తో కూర్చోబెట్టిన సినిమా 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డుల నమోదు 
  • దర్శకుడికి దక్కిన ప్రశంసలు 
  • ఆయనకి భారీ ఆఫర్ ఇచ్చిన లైకా
Jude Anthany Joseph Next Movie Update

సినీ ప్రేమికులకు ఎప్ప‌టిక‌ప్పుడు భారీ చిత్రాలను .. విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌నే కాదు.. వైవిధ్య‌మైన కాన్సెప్ట్ మూవీస్‌ను కూడా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ అందిస్తోంది. ఓ వైపు స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తూనే, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. 


లైకా త‌మ బ్యాన‌ర్‌లో కొత్త సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న‌న‌ను విడుద‌ల చేసింది. లైకా బ్యానర్లో ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేదెవ‌రో కాదు.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ జూడ్ ఆంథోని జోసెఫ్‌. రియ‌ల్ కాన్సెప్ట్‌తో ‘2018’ వంటి ఓ విభిన్న‌మైన సినిమాను తెర‌కెక్కించిన ఆంథోని జోసెఫ్ అంద‌రి ప్రశంసలను అందుకున్నారు. 

2018లో కేర‌ళ‌లో వర‌ద బీభ‌త్సాన్ని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఆ వాస్తవ ఘ‌ట‌నను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన ఆంథోని జోసెఫ్ .. మ‌రో డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యారు. ఈసారి ఆయ‌న‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ చేతులు క‌లిపింది. ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను మించేలా ఓ మెస్మ‌రైజింగ్ మూవీతో రాబోతున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చెప్పింది. 

  • Loading...

More Telugu News