బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గజ్వేల్ లో శివాజీ విగ్రహానికి అవమానం
- హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు బయల్దేరిన రఘునందన్ రావు
- హకీంపేట వద్ద రఘునందన్ ను అడ్డుకున్న పోలీసులు
అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సందీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘటనతో గజ్వేల్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఆందోళన చేపట్టింది.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ కు వెళ్తున్న రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘునందన్ కు బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఈటల మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.