Ramcharan: విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్ర!

Ram Charan To Cameo In Thalapathy Vijay and Lokesh Kanagaraj Leo
షార్ట్స్‌లో చూడండి
తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ తో సంచలన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ‘లియో’సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీన్ని రెట్టింపు చేసేలా దర్శకుడు లోకేశ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అతిథి పాత్ర చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ మధ్య లోకేశ్, చరణ్ డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ ఓ కీలక పాత్ర కోసం చెర్రీని ఒప్పించేందుకు డిన్నర్‌‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌ లో హీరో గురించి చెప్పే అతిథి పాత్రకు చరణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
Go Back to Shorts
Ramcharan
Thalapathy Vijay
Lokesh Kanagaraj
Leo movie
Cameo

More Telugu News