Mahesh Babu: 'గుంటూరు కారం' .. ఇంత ఘాటు ఇదే ఫస్టు టైమ్!

Gunturu Karam Movie Update
షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో 'గుంటూరు కారం' సినిమా రూపొందుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. గతంలో త్రివిక్రమ్ - మహేశ్ కలిసి రెండు సినిమాలు చేశారు ... ఇది మూడో సినిమా. ఈ సినిమా నుంచి ఇటీవల మహేశ్ పోస్టర్ ను వదిలిన సంగతి తెలిసిందే. టైటిల్ కి తగినట్టుగానే పండు మిరపకాయ రంగు షర్టులో .. అదే కలర్ టవల్ ను తలకి చుట్టుకుంటూ మహేశ్ బాబు కనిపించాడు.

మహేశ్ బాబును ఇంత మాస్ లుక్ తో చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే మహేశ్ బాబు సినిమాలో యాక్షన్ ఉంటుంది .. కానీ మాస్ యాక్షన్ తక్కువ. ఇంతవరకూ ఆయన తెరపై ఎక్కువగా డీసెంట్ గా .. రాయల్ గా కనిపిస్తూనే విలన్ గ్యాంగ్ భరతం పడుతూ వచ్చాడు. ఈ సినిమాకి ముందు ఒక అరడజను సినిమాలను తీసుకుంటే, ఆయన యాక్షన్ స్టైలీష్ గానే సాగుతూ వచ్చింది. 

ఇక త్రివిక్రమ్ సినిమాల్లో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ తో కూడిన యాక్షన్ ఉంటుంది. ఆయన కూడా పక్కా మాస్ టైటిల్ తో .. మాస్ కంటెంట్ తో సినిమా చేయలేదనే చెప్పాలి. 'అరవింద సమేత'లో యాక్షన్ టచ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, టైటిల్ డీసెంట్ గానే అనిపిస్తుంది. పూర్తిస్థాయి మాస్ యాక్షన్ .. అందునా మహేశ్ ఇంతవరకూ చేయని జోనర్లో త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరి వైపు నుంచి చూసినా, కాస్త ఘాటు ఎక్కువగానే అనిపిస్తోంది మరి. సంక్రాంతికి ఈ ఘాటు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫీట్ చేస్తుందో చూడాలి మరి.   

Go Back to Shorts
Mahesh Babu
Sreeleela
Jagapathi Babu

More Telugu News