నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్.. పోలీసు అధికారిపై విమర్శల వెల్లువ
- పూణెలోని రైల్వే స్టేషన్‌లో పడుకున్న వారి ముఖంపై నీళ్లు జల్లి నిద్రలేపిన పోలీసు
- పోలీసు అధికారి ప్రవర్తనపై నెట్టింట తీవ్ర విమర్శలు
- ఘటనపై స్పందించిన రైల్వే మేనేజర్, బాధ కలిగిందని వ్యాఖ్య
- నిబంధనలపై ప్రజలకు సరైన తీరులో అవగాహన కల్పించాలని సూచన
పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే మేనేజర్ స్వయంగా స్పందించారు. ‘‘ప్లాట్‌ఫామ్‌పై నిద్రించడం ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రయాణికులకు సరైన రీతిలో అవగాహన కలిగించాలి. అంతేకానీ, ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఈ సంఘటన తీవ్రంగా బాధించింది’’ అని ఆయన కామెంట్ చేశారు.