హైదరాబాద్ అభిమానులకు ఊరట.. రెండు వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల కేటాయింపు
- వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
- హైదరాబాద్ కు టీమిండియా మ్యాచ్ ఇవ్వకపోవడంపై విమర్శలు
- మూడు ప్రధాన మ్యాచ్ లకు తోడు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల
ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ
దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో బీసీసీఐ, ఐసీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రపంచ కప్ నకు ముందు సెప్టెంబర్ 29 నుంచి జరిగే వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ ను వేదికగా ఎంపిక చేసింది. హైదరాబాద్ తో పాటు గువాహతి, తిరువనంతపురం నగరాలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ కు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను కేటాయించింది. సెప్టెంబర్ 29న పాకిస్థాన్ – న్యూజిలాండ్, అక్టోబర్ 3న పాకిస్థాన్–ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తంగా మూడు ప్రధాన, రెండు ప్రాక్టీస్ సహా ఉప్పల్ స్టేడియం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.